జైలుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నా : కంగన - Waiting to be in jail claims Kangana Ranaut
close
Published : 23/10/2020 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జైలుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నా : కంగన

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబయి కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ బాలీవుడ్‌ నటి, ఆమె సోదరి రంగోలీ చందేలాపై ముంబయిలో కేసు నమోదయ్యింది. మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు.. వీరు వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు ఆదర్శప్రాయులైన మహనీయుల మాదిరిగానే.. తాను కూడా  జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ కంగన ప్రకటించింది.

వీర సావర్కర్‌, నేతాజీ‌ వంటి వారు తనకు ఆదర్శమని.. వారిలా తాను కూడా జైలు జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కంగన ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా నటుడు ఆమిర్‌ ఖాన్‌ మౌనం వహించటం పట్ల ఆమె పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది. రాణి లక్ష్మీ బాయి కోటను కూలగొట్టినట్టే, తన ఇంటిని కూడా ధ్వంసం చేశారని.. వీర సావర్కర్‌ను కారాగారంలో ఉంచగా, తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని కంగన ఆరోపించింది.  దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తున్న సభ్యులను ఇక్కడ ఎన్ని బాధలకు గురయ్యారో ఎవరైనా ప్రశ్నిస్తే బాగుంటుంది అంటూ.. ఆ పోస్టును ఆమిర్‌ ఖాన్‌కు ట్యాగ్‌ చేశారు. దేశంలో అసహనం పెరగడం పట్ల ఆమిర్‌ ఖాన్‌ గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ బిడ్డ క్షేమం కోసం భారత్‌ విడిచి వెళ్లాలని తన భార్య ప్రతిపాదించినట్టు ఆయన చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని