డ్రగ్స్‌ తీసుకోమన్నారు: అక్తర్‌ - Was told to use drugs to enhance my bowling speed Shoaib Akhtar
close
Published : 25/11/2020 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ తీసుకోమన్నారు: అక్తర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బౌలింగ్‌లో వేగం పెంచుకోవడానికి కొంతమంది తనని డ్రగ్స్‌ తీసుకోమన్నారని, అయితే వాటిని తిరస్కరించానని పాకిస్థాన్ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అక్తర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే డ్రగ్స్‌ వాడమని తెలిపిన వ్యక్తుల పేర్లను వెల్లడించలేదు. ఎంతో ప్రతిభ ఉన్న కొందరు యువ క్రికెటర్లు తప్పుదోవ పట్టి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అక్తర్‌ అన్నాడు.

‘‘క్రికెట్ ప్రారంభించిన రోజుల్లో బౌలింగ్‌లో వేగం పెంచుకోవాలన్నా, కనీసం గంటకు 100 కి.మీ వేగంతో బంతులు సంధించాలన్నా మాదక ద్రవ్యాలు తీసుకోవాలన్నారు. అయితే వాటిని నేను తిరస్కరించా’’ అని అక్తర్ తెలిపాడు. సమావేశానికి హాజరైన చిత్రాలను అక్తర్ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ‘‘మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సమావేశానికి అతిథిగా వచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నా. పాకిస్థాన్‌ను మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చడానికి సంబంధిత శాఖ గొప్పగా పనిచేస్తుంది. మంచి భవిష్యత్తు కోసం ఆటలు ఆడండి, శారీరక కసర్తతులు చేయండి’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు.

కాగా, నిలకడగా 151 కి.మీ వేగంతో బంతులు సంధించే అక్తర్‌ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగమైన బంతిని వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2002లో న్యూజిలాండ్‌పై 161 కి.మీ/వేగంతో బంతిని వేసి ఈ ఘనత సాధించాడు. పాక్ తరఫున అతడు 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. 2010లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతడు తన కెరీర్‌లో 444 వికెట్లు పడగొట్టాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని