‘హీరామండి’కి ‘పాకీజా’తో పోలికేంటి? - We Already Have A Pakeezah Do not Need Another One Says Sanjayleela Bhansali
close
Updated : 10/09/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హీరామండి’కి ‘పాకీజా’తో పోలికేంటి?

ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్న వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆయన రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. వేశ్యల సంస్కృతి నేపథ్యంలో సాగే కథ ఇది. గతంలో భన్సాలీ రూపొందించిన ‘పాకీజా’ ఇలాంటి కథతోనే తెరకెక్కి మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ‘హీరామండి’ని ‘పాకీజా’తో పోలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భన్సాలీ స్పందించారు. ‘‘వేశ్యల నేపథ్యం అనేది తప్పితే ‘హీరామండి’కి ‘పాకీజా’తో ఎలాంటి పోలికా లేదు. వేశ్యల మీద సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు మనసులో పాకీజా ఎలా ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ‘హీరామండి’ సిరీస్‌ ‘పాకీజా’ చిత్రాన్ని గుర్తు చేయదు. మనకు ఇప్పటికే ‘పాకీజా’ ఉన్నప్పుడు మరోటి అవసరం లేదు’’ అని చెప్పారు. ‘హీరామండి’ ఒకటో సీజన్‌లో ఏడు ఎపిసోడ్లు ఉంటాయి. రెండో సీజన్‌లో అంతకుమించి ఉంటాయని తెలుస్తోంది. తొలి ఎపిసోడ్‌కు భన్సాలీ దర్శకత్వం వహిస్తుండగా, మిగిలిన ఆరింటికి ఆయన సహాయకుడు విభు పురి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ సిరీస్‌లో అలియాభట్‌, హ్యుమా ఖురేషి, సోనాక్షి సిన్హా తదితరుల్ని ఎంపిక చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని