
తాజా వార్తలు
నా భర్తతో గొడవ అప్పుడే..: జెనీలియా
ముంబయి: తన భర్త రితేష్ దేశ్ముఖ్ది గొడవపడే తత్వం కాదని, ఈ విషయంలో మెచ్చుకోవచ్చని నటి జెనీలియా అన్నారు. వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటై దాదాపు తొమ్మిదేళ్లైంది. 2003లో విడుదలైన ‘తుజే మేరీ కసమ్’ షూటింగ్లో వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆపై పదేళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట 2012లో ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో భార్యాభర్తలయ్యారు. 20 ఏళ్లుగా రితేష్‌తో బంధం గురించి ప్రశ్నించగా జెనీలియా స్పందించారు. ‘మేమిద్దరం డేటింగ్లో ఉన్నప్పుడు.. ఇన్నేళ్లుగా ఈ రిలేషన్‌ను ఎలా కొనసాగిస్తున్నారని చాలా మంది ప్రశ్నించారు. అప్పుడు దానికి మా వద్ద సమాధానం లేదు. ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లైన తర్వాత, ఇద్దరు పిల్లలు జన్మించాక కూడా అలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. నాకు తెలిసి మేమిద్దరం ఎక్కువగా కమ్యూనికేట్ అవుతుంటాం, అది లేకపోవడం వల్లే అనేక బంధాల్లో ఇబ్బందులు ఎదురౌతున్నాయి’.
‘అందరిలాగే.. మేమూ వాదించుకుంటాం. తను లేకపోతే నేను జీవించలేనని భావోద్వేగానికి గురైన సందర్భాలూ ఉన్నాయి. ఇదంతా జీవితంలో భాగం. కానీ మా ఇద్దరికీ లైఫ్‌లో ఏది ముఖ్యమో బాగా తెలుసు. అందుకే చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వం. రితేష్ వల్ల ఎప్పుడూ సమస్యలు రావు, దానికి అతడిని ప్రశంసించాలి. కేవలం నేను కొట్లాడాలనుకుంటే తప్ప... మా మధ్య గొడవలు రావు. నేను కాస్త విభిన్నమైన మనిషిని (నవ్వుతూ). ఎక్కువగా మమ్మల్ని బాధించిన పనుల గురించి చర్చించుకుంటాం. మరోసారి అలా జరగకుండా చూసుకుంటాం. ఇలాంటి సూత్రాలే మా బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంటాయి’ అని ఆమె పేర్కొన్నారు. జెనీలియా బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌కు దగ్గరైన సంగతి తెలిసిందే. ‘సత్యం’, ‘సాంబా’, ‘సై’, ‘హ్యాపీ’, ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’, ‘రెడీ’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
