దేశాల సమగ్రతను గౌరవించాలి: మోదీ - We should respect sovereignty and territorial integrity PM Modis message to China Pak at SCO summit
close
Updated : 10/11/2020 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశాల సమగ్రతను గౌరవించాలి: మోదీ

దిల్లీ: షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో)లోని సభ్య దేశాలన్నీ ఒకదానినొకటి గౌరవించుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో వెల్లడించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశానికి ఎనిమిది సభ్యదేశాలు హాజరయ్యాయి. కాగా సమావేశంలో మోదీ ముఖ్యంగా పాక్‌, చైనాలను ఉద్దేశిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ.. ‘ఎస్‌సీవో దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేయడానికి భారత్‌ ఎంతో కృషి చేస్తోంది. దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వారి సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ముఖ్యం. అంతేకాని కొన్ని దేశాలు ఎస్‌సీవో ఏర్పాటు చేసిన సూత్రాలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సమస్యలను పదేపదే లేవనెత్తుతున్నాయి. ఇది ఎంతో దురదృష్టకర పరిణామం అని పాక్‌కు పరోక్షంగా చురకలంటించారు. కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో మొత్తం మానవాళికి సాయపడటానికి, టీకా తయారీ, పంపిణీకి భారత్‌ తన శాయశక్తులా కృషి చేస్తుంది. కరోనా ఆపత్కాలంలో భారత ఫార్మా రంగం దాదాపు 150 దేశాలకు మందులను సరఫరా చేసింది’ అని మోదీ ప్రసంగంలో వెల్లడించారు. భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో మోదీ చేసిన ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌లు సైతం పాల్గొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని