క్రేజీ ఫొటోలతో వీకెండ్‌ మస్తీ..! - Weekend Crazy Photos In Social media
close
Updated : 21/12/2020 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రేజీ ఫొటోలతో వీకెండ్‌ మస్తీ..!

పవన్‌ సింప్లిసిటీ.. మహేశ్‌ ఫ్యామిలీ నైట్‌ ఔట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ వీకెండ్‌ సినీ ప్రియులకు కొన్ని మధురమైన అనుభూతులను అందించింది. ఇటీవల దిల్‌రాజు బర్త్‌డే వేడుకల్లో సందడి చేసిన స్టార్‌ హీరోలందర్నీ చూసి అభిమానులు ఎంతో సంతోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం కూడా తాజాగా కొంతమంది హీరోలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో ప్రతిఒక్కర్నీ ఎంతో ఆకర్షించాయి. ఓవైపు పవర్‌స్టార్‌ సింప్లిసిటీ.. మరోవైపు మహేశ్‌ ఫ్యామిలీ నైట్‌ ఔట్స్‌.. ఇలా కొన్ని ఫొటోలు అభిమానుల దృష్టిని తమవైపుకు తిప్పుకున్నాయి. అలాంటి కొన్ని వీకెండ్‌ క్రేజీ ఫొటోలపై ఓ లుక్కేయండి..!

పవర్‌స్టార్‌ సింప్లిసిటీ..

పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్‌లో భాగంగా పవన్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా తనని చూసేందుకు వచ్చిన అభిమానులతో పవన్‌ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులతో కలిసి పవన్‌ నేలపై కూర్చొవడం చూసి ఆయన సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.


మహేశ్‌ ఫ్యామిలీ నైట్‌ ఔట్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ రెండు కుటుంబాలు కలిసి సరదాగా సమయాన్ని గడిపాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఓ ఫొటోని షేర్‌ చేశారు. ‘ఫన్‌ ఫ్యామిలీస్‌..!! నైట్‌ ఔట్స్‌’ అని ఆమె క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే, త్వరలోనే మహేశ్‌-వంశీపైడిపల్లి కాంబోలో సినిమా ఉండొచ్చని అభిమానులు చెప్పుకుంటున్నారు.


క్లైమాక్స్‌ పూర్తి..

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ - ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సీక్వెల్‌ ‘కేజీఎఫ్‌-2’. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ‘అధీర’గా ప్రతినాయకుడి పాత్రలో మెప్పించనున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రశాంత్‌నీల్‌ అభిమానులతో సంజయ్‌దత్‌ దిగిన కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.


హీరోని కలిసిన దర్శకులు..

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేనిని తాజాగా దర్శకులు కిషోర్‌ తిరుమల, గోపీచంద్‌ మలినేని, అనిల్‌రావిపూడి, సంతోష్‌ శ్రీనివాస్‌, వెంకీ కుడుముల కలిశారు. రామ్‌ ఇంటికి వెళ్లిన ఈ దర్శకులందరూ ఆయనతో సమయాన్ని సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది.

ఇవీ చదవండి

చిరు సర్‌.. ఇబ్బందిపడ్డారు: సోనూసూద్‌

బ్యాట్‌ పట్టిన సోనూ.. కన్నీళ్లు పెట్టిన అనితమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని