అప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ, బాబర్‌ - West Indies former bowler Ian Bishop feels Virat Kohli and Babar Azam looks like Sachin Tendulkar
close
Published : 10/08/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ, బాబర్‌

వాళ్లిద్దరూ లిటిల్‌మాస్టర్‌లా అనిపిస్తారు: ఇయన్‌ బిషప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత క్రికెట్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ ఎంతో మెరుగ్గా రాణిస్తూ అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరిలో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్‌ అనే చర్చ కూడా క్రికెట్‌ వర్గాల్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది వీరిద్దరినీ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో పోల్చాడు వెస్టిండీస్‌ మాజీ బౌలర్‌ ఇయాన్‌ బిషప్‌. తాజాగా అతడు జింబాబ్వే ఆటగాడు పామీ బంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ ఇలా పోల్చి చెప్పాడు. 

‘విరాట్‌ కోహ్లీ, బాబర్‌ అజామ్‌ స్ట్రైట్‌గా ఆడటం చూస్తే సచిన్‌ తెందూల్కర్‌ గుర్తొస్తాడు. లిటిల్‌ మాస్టర్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనడానికి ఒక కారణం ఉంది. నా బౌలింగ్‌లో అతనెప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇప్పుడున్న బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ, బాబర్‌ అలాగే ఆడుతున్నారు’ అని బిషప్‌ పేర్కొన్నాడు. అనంతరం టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌పై స్పందిస్తూ.. అతడో అత్యుత్తమ పేసర్‌ అని, అన్ని ఫార్మాట్లకు తగ్గట్టు బౌలింగ్‌ చేయడం మరింత మంచి విషయమని మెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ వన్డేల్లో ఒకటి, టెస్టుల్లో రెండు, టీ20ల్లో పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు బాబర్‌ వన్డేల్లో మూడు, టెస్టుల్లో ఆరు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని