ఈ-కామర్స్ విస్తరణ దిశగా రిలయన్స్‌ అడుగులు - What Mukesh Ambani Excuting To Expand His Online Firm Jio Mart
close
Published : 18/08/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ-కామర్స్ విస్తరణ దిశగా రిలయన్స్‌ అడుగులు

ముంబయి: ఇప్పటి వరకు అమెజాన్‌, వాల్‌మార్ట్‌లకు మాత్రమే సొంతమైన ఈ-కామర్స్‌ రంగంలోకి జియో మార్ట్ పేరుతో రిలయన్స్‌ కూడా తన సేవలు ప్రారంభించింది. తాజాగా దీనిని మరింత విస్తరింపజేయాలని రిలయన్స్‌ భావిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ స్థానికంగా సేవలందిస్తున్న పలు రకాల ఈ-కామర్స్‌ సంస్థల కొనుగోలుకు సంబంధించి వాటితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో జియో మార్ట్‌లో మరిన్ని రకాల సేవలు అందుబాటులోకి తేవాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో ఫర్నిచర్‌, లోదుస్తులు, మందులు, పాలు సరఫరా చేసే పలు సంస్థలతో రిలయన్స్‌ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

గతంలో జియోలో వాటాలు విక్రయం తర్వాత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌లోకి పెట్టుబడులను ఆహ్వానించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. ఈ-కామర్స్‌ రంగంలో రిలయన్స్‌ విస్తరణను ప్రారంభిస్తే రాబోయే ఐదేళ్లలో అతి పెద్ద ఈ-కామర్స్‌ సంస్థగా అవతరించే అవకాశం ఉందని పలువురు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన బొమ్మల సంస్థ హామ్‌లేస్‌, మ్యూజిక్‌ యాప్‌ సావన్‌, లాజిస్టిక్‌ సేవల సంస్థ గ్రబ్‌ సర్వీసెస్‌, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ హాప్టిక్‌లను రిలయన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యూచర్‌ గ్రూప్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు కూడా రిలయన్స్ ఆసక్తి కనబర్చినట్టు వార్తలు వెలువడ్డాయి.

కరోనా ప్రభావంతో ఈ-కామర్స్‌ సేవలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో బయటి వెళ్లి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి కనబరచడం లేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో జియో మార్ట్‌ను మరింతగా విస్తరించి దాని ద్వారా మరిన్ని సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్‌ తన సేవలను అందిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని