రజనీకాంత్‌తో చిన్నారి.. ఎవరో తెలుసా మరి.. - Who is the cutie pie with Superstar Rajinikanth
close
Published : 22/11/2020 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీకాంత్‌తో చిన్నారి.. ఎవరో తెలుసా మరి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్న చిత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఆ చిన్నారి ఎవరనే విషయం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. దీనిని భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరైన ఏఆర్‌ రెహమాన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు. అలనాటి ఫొటోలను తన అభిమానులతో షేర్‌ చేసుకోవటం ఈ ఆస్కార్‌ అవార్డు గ్రహీతకు అలవాటే.

రెహమాన్‌, ఆయన సతీమణి సైరాబానుకు 1997లో వివాహమైంది. వారికి రహీమా అనే అమ్మాయి, అమీన్‌ అనే అబ్బాయి ఉన్నారు. కాగా ఈ ఫొటో గురించి వివరిస్తూ.. 1999 నాటి ఆ చిత్రంలో ఉన్నది తన కుమార్తె రహీమా అని రెహమాన్‌ వెల్లడించారు. అది ‘పడయప్పా’ (తెలుగులో నరసింహ) చిత్ర నిర్మాణ సమయం నాటిదని ఆయన అన్నారు. ఈ చిత్రంతో పాటుగా రజనీ నటించిన శివాజీ, లింగా, ముత్తు, ఎంథిరన్‌ (రోబో), కోచ్చాడయన్‌ చిత్రాలకు కూడా ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని