నిహారిక పెళ్లి: వాళ్లిద్దరే ఎందుకంటే..? - Why Only RituVarma And Lavanya Attends Niharika Wedding Celebrations
close
Updated : 09/12/2020 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక పెళ్లి: వాళ్లిద్దరే ఎందుకంటే..?

సంగీత్‌-మెహందీల్లో సందడి చేసిన రీతూ-లావణ్య

ఇంటర్నెట్‌డెస్క్‌: కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిహారిక కొణిదెల పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం జరిగిన హల్దీ వేడుకల్లో వధూవరులు పసుపు వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నాగబాబు ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘ఉదయ్‌పూర్‌లోని ఆకాశానికి పసుపు రంగులద్దుతున్నాం’ అని అన్నారు. అయితే, శనివారం పెళ్లికుమార్తెను చేయడంతో నాగబాబు నివాసంలో పెళ్లితంతు మొదలయ్యింది. ఆ రోజు మెగా-అల్లు కుటుంబసభ్యులే కాకుండా ఇండస్ట్రీ నుంచి మెహర్ ‌రమేష్‌, లావణ్యత్రిపాఠి, గెటప్‌ శ్రీను.. నాగబాబు నివాసంలో సందడి చేసినట్లు పలు ఫొటోలు బయటకు వచ్చాయి.

కాగా, ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న వేడుకలో సైతం నటీమణులు రీతూవర్మ-లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకల్లో భాగంగా వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, బన్నీతో దిగిన ఫొటోలను వాళ్లిద్దరూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే నిహారిక.. రీతూ-లావణ్యను ఆహ్వానించడానికి ప్రత్యేక కారణముంది. వాళ్లు ముగ్గురూ.. మంచి స్నేహితులు మాత్రమే కాకుండా జిమ్‌మేట్స్‌ కూడా. వర్కౌట్ల అనంతరం జిమ్‌లో లావణ్య, రీతూలతో తీసుకున్న ఫొటోలనూ పలు సందర్భాల్లో నిహారిక షేర్‌ చేశారు. దీంతో ఇటీవల నిహారిక-చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత రీతూవర్మ-లావణ్య.. ఆమెకు ప్రత్యేకంగా పార్టీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొట్టాయి.

వేడుకగా నిహారిక మెహందీ ఫంక్షన్‌ (ఫొటోలు)

ఇవీ చదవండి

అభిమానులను ‘ఖుషీ’ చేసిన అకీరా

#NISChay: డ్యాన్స్‌ చేసిన చిరు, అరవింద్‌ దంపతులు

Day1: నిహారిక పెళ్లి వేడుక వీడియో చూశారా?Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని