కంగనకు సమన్లు ఎందుకివ్వలేదు..? - Why has not NCB summoned Kangana Ranaut who admitted to taking drugs
close
Updated : 24/09/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంగనకు సమన్లు ఎందుకివ్వలేదు..?

ఎన్సీబీ తీరుపై మండిపడ్డ నగ్మా

ముంబయి: ఒకప్పుడు తాను డ్రగ్స్‌కి బానిసయ్యానని బాలీవుడ్‌ నటి కంగన రనౌతే స్వయంగా చెప్పినప్పటికీ ఎన్సీబీ అధికారులు ఆమెకు సమన్లు ఎందుకు ఇవ్వలేదని నటి, కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితోపాటు డ్రగ్స్‌ సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వాట్సాప్‌ సందేశాల ఆధారంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారే ఆరోపణలతో బాలీవుడ్‌ నటీమణులు దీపికా పదుకొణె, సారాఅలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, రకుల్‌కు ఎన్సీబీ అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు.

కాగా, వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని సదరు నటీమణులకు సమన్లు జారీ చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మా తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా ఎన్సీబీ తీరుపై నిప్పులు చెరిగారు. ‘వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని కొంతమంది నటీమణులకు సమన్లు జారీ చేసినప్పుడు.. డ్రగ్స్‌ తీసుకున్నానని బహిరంగంగా చెప్పిన కంగన రనౌత్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు ఎందుకివ్వలేదు?. సెలబ్రిటీల సమాచారాన్ని పత్రికలకు అందచేసి వారిని ప్రజల్లో అపఖ్యాతి పాలుచేయడం ఎన్సీబీ విధా? ఇది నిజంగా విచారకరమైన విషయం’ అని నగ్మా పేర్కొన్నారు.

అంతేకాకుండా అనురాగ్‌ కశ్యప్‌, దీపికా పదుకొణె, దియా మీర్జా.. వీళ్లంతా ఒకప్పుడు భాజపాకు వ్యతిరేకంగా గళం విప్పారని.. అందుకే వారిని ఈవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ నగ్మా కొన్ని ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌కి న్యాయం జరగాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా మొదట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కంగన రనౌత్.. ఇప్పుడు బాలీవుడ్‌కు వ్యతిరేకంగా తాజా వ్యాఖ్యలు చేశారు. అలాగే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసు విషయంలో ముంబయి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ఇప్పుడు స్వచ్ఛంద పదవీవిరమణ చేసి భాజపా టికెట్‌ తీసుకుని రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటున్నారని నగ్మా పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని