రంగమార్తాండతో రంగమ్మత్త పేరు మారుతుందా? - Will Anasuya Overcome Rangammatha Tag With Rangamaarthaanda
close
Updated : 12/10/2020 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రంగమార్తాండతో రంగమ్మత్త పేరు మారుతుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన మాటలు, పంచ్‌ డైలాగ్‌లు, చిరునవ్వులతో బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్నారు అనసూయ. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా ఆమె నటన అందరినీ కట్టిపడేసింది. దీంతో అప్పటి నుంచి ఆమె అందరికీ రంగమ్మత్త అయిపోయారు. అంతేకాదు, ఆ సినిమా తర్వాత నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రల వైపు అనసూయ మొగ్గు చూపుతున్నారు.

తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రం ‘రంగ మార్తండ’. ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’ పాత్ర ఎంత కీలకమో ఇందులో కూడా ఆ స్థాయిలోనే పాత్ర తీరు ఉంటుందని టాలీవుడ్‌ టాక్‌. ఆమె దేవదాసి పాత్రలో కనిపిస్తారని సమాచారం. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు కూడా ఇందులో నటిస్తుండటం విశేషం. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని