టీకా పంపిణీ తర్వాత ఆ పనే: అమిత్‌ షా - Will Consider CAA As Soon As Covid Vaccination Starts Amit Shah
close
Updated : 22/12/2020 04:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా పంపిణీ తర్వాత ఆ పనే: అమిత్‌ షా

బోల్పూర్‌: కరోనా వ్యాప్తి కారణంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం కాస్త తెరమరుగయ్యిందని.. దేశంలో టీకా పంపిణీ మొదలు కాగానే ఆ విషయంపై దృష్టి పెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటన సందర్భంగా భాజపా అధినేత జేపీ నడ్డా కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలని షా విరుచుకు పడ్డారు. 

ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యూటేషన్‌పై పంపించాలని కోరుతూ కేంద్రం, తృణమూల్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగా, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, ఆమోద యోగ్యం కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించే బాధ్యత వారిపై ఉన్నందున.. సంబంధిత ఐపీఎస్‌ అధికారులను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. వివరణ కోరుతూ రాష్ట్రానికి లేఖ రాయటం చట్టబద్ధమేనని.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నిబంధనల పుస్తకాలను ఓ సారి పరిశీలించాలంటూ ఆయన మమత ప్రభుత్వానికి హితవు పలికారు.

పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నియమాలను రూపొందించటం ఓ భారీ ప్రక్రియ అని అమిత్‌ షా తెలిపారు. ప్రస్తుతమున్న కొవిడ్‌ పరిస్థితిలో దానిని కొనసాగించలేమన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ ద్వారా కరోనా శృంఖలాన్ని ఛేదించిన వెంటనే తాము ఈ అంశంపై దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మమత, ఆమె పార్టీయే  ‘స్థానికులు- పరాయివారు’ అనే అంశాన్ని లేవనెత్తారని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి విమర్శించారు.

ఇవీ చదవండి

బెంగాల్‌ మార్పు కోరుకుంటోంది..

గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తాం..


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని