జాన్వీ తొలి తెలుగు మూవీ అదే అవుతుందా? - Will Janhvi Kapoor screen share with NTR under Trivikram direction
close
Published : 05/09/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాన్వీ తొలి తెలుగు మూవీ అదే అవుతుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తెలుగు తెరకు పరిచయం కావడానికి రంగం సిద్ధమైందా? ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులు వేచి చూస్తున్న తరుణం రానుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిందే. ఈ ఏడాది చివరికి సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇంకాస్త ఆలస్యం కానుంది.

అయితే, ఇటీవల చిత్ర నిర్మాత నాగ వంశీ ట్వీట్‌ చేస్తూ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నుంచి తమకు సందేశాలు వస్తున్నాయని, షూటింగ్‌ మొదలు పెట్టగానే అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. తాజాగా జాన్వీకపూర్‌ పేరు వినిపిస్తోంది. ‘ఎన్టీఆర్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక వేట కొనసాగుతోంది. వారిలో జాన్వీకపూర్‌ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ తుది దశకు చేరుకుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి’ అని చిత్ర బృందానికి చెందిన విశ్వసనీయ వర్గాలు అన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. పూరి-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’లో నాయికగా చేయాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో అనన్య పాండే వచ్చింది. మరోవైపు ఇటీవల జాన్వీ నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. 

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. కరోనా కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. ఎన్టీఆర్‌పైనే కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత తారక్‌-త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని