రివ్యూ పిటిషన్‌ వేసే హక్కుంది:ప్రశాంత్‌ భూషణ్‌ - Will pay fine to SC Bhushan
close
Updated : 31/08/2020 18:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ పిటిషన్‌ వేసే హక్కుంది:ప్రశాంత్‌ భూషణ్‌

దిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో తనకు సుప్రీం కోర్టు విధించిన రూపాయి జరిమానాను గౌరవంగా చెల్లిస్తానని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. సుప్రీం తీర్పు అనంతరం దిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టును అగౌరవపరిచేలా తాను ట్వీట్లు చెయ్యలేదని పునరుద్ఘాటించారు. తనకు సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని చెప్పారు. కోర్టు బలహీన పడితే ప్రజలే బలహీన పడతారని, కోర్టు గెలిస్తే ప్రతి భారతీయుడూ విజయం సాధించనట్లేనని చెప్పారు. దృఢమైన న్యాయవ్యవస్థను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. అలాగే, ధిక్కరణ కేసులో రివ్యూ పిటిషన్‌ వేసే హక్కు తనకుందని చెప్పారు. అయితే, పిటిషన్‌ దాఖలు చేస్తారా? లేదా అన్నది తెలియజేయలేదు.

కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో ప్రశాంత్‌ భూషణ్‌కు భారత్‌ అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సెప్టెంబర్‌ 15లోగా రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. డిపాజిట్‌ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష , మూడేళ్లపాటు ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది. కాగా ఈ రూపాయిని  వెంటనే ఆయన తరఫు న్యాయవాది, సీనియర్‌ సహచరుడు రాజీవ్‌ ధావన్‌ విరాళంగా ఇచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని