వారంలో 3.5 లక్షల కేసులు - With nearly 3 5 lakh Covid 19 cases in a week Indias tally reaches 2153010
close
Published : 09/08/2020 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో 3.5 లక్షల కేసులు

మూడు రోజులుగా 60 వేలు దాటుతున్న కరోనా బాధితుల సంఖ్య

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. దేశంలో కొద్దిరోజులుగా ప్రతిరోజు 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 21.5 లక్షల మంది వైరస్‌ బారిన పడగా, కేవలం ఈ ఒక్క వారంలోనే 3.5 లక్షల మందికి మహమ్మారి సోకింది. 5,244 మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆరోగ్య శాఖ డ్యాష్‌బోర్డు వివరాల ప్రకారం.. దేశంలో నేటివరకు 21,53,010 మందికి వ్యాధి సోకింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 64,399 మంది వైరస్‌ బారిన పడ్డారు. 861 మంది మృతిచెందారు. వరుసగా మూడు రోజులుగా దేశంలో 60 వేల కేసులు దాటుతున్నాయి. ఆదివారం 64,399 కేసులు నమోదవగా, శనివారం 61,537 కేసులు, శుక్రవారం 62,538 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు 14.8 లక్షల మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 68.78 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 53,877 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 6,28,747 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 43,379 మంది మృతిచెందినట్లు తెలిపింది. ‘గడిచిన నెల రోజుల్లో కొవిడ్‌-19 రికవరీ రేటు 48.20 శాతం నుంచి 68.32 శాతానికి పెరిగింది. మెరుగైన చికిత్స అందించడం వల్లనే రికవరీ రేటు పెరిగింది. మృతుల సంఖ్య తగ్గింది’ అని ఆరోగ్య శాఖ ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. కరోనా పరీక్షలను భారీగా పెంచామని, గడిచిన 24 గంటల్లో 7 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని