మహిళల భారత్‌xఆస్ట్రేలియా సిరీస్‌ వాయిదా - Womens Team India and Australia Common Wealth Bank odi series postponed
close
Updated : 31/12/2020 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళల భారత్‌xఆస్ట్రేలియా సిరీస్‌ వాయిదా

ఇంటర్నెట్‌డెస్క్‌: 2021 జనవరిలో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగాల్సిన 3 వన్డేల కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కరోనా కారణంగా వచ్చే సీజన్‌కు దీనిని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఆ పర్యటనలో కొత్తగా 3 టీ20ల సిరీస్‌ను చేర్చాలనే ప్రణాళిక పరిశీలనలో ఉన్నట్లు ట్వీట్‌ చేసింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియా మహిళల 2020 టీ20 ప్రపంచకప్‌ నిర్వహించింది. అందులో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరాయి. తుది పోరులో భారత్‌ 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టు 20 ఓవర్లలో 184/4 పరుగులు చేయగా, భారత్‌ 99 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత కరోనా వైరస్‌ ప్రభావంతో భారత మహిళల జట్టు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. 

మరోవైపు భారత పురుషుల జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే పర్యటిస్తోంది. యూఏఈలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తయ్యాక నేరుగా ఆస్ట్రేలియా చేరిన కోహ్లీసేన అక్కడ వన్డే సిరీస్‌ కోల్పోయినా టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇప్పుడు జరుగుతున్న 4 టెస్టుల సిరీస్‌లో 1-1 గెలుపుతో సమానంగా నిలిచింది. జనవరి 7 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. 

ఇవీ చదవండి..
ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవం
ధోనీ, కోహ్లీ సరసన నిలిచా: జడేజా


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని