కరోనా సరిపోదా?.. ఇంకా వర్షాలు కూడానా..! - Work Never Stops Says Rakul
close
Published : 20/10/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా సరిపోదా?.. ఇంకా వర్షాలు కూడానా..!

షూటింగ్‌ సెట్‌లో రకుల్‌ప్రీత్

హైదరాబాద్‌: ఇటీవల డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణను ఎదుర్కొన్న నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తిరిగి సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. ఇటీవల ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ ఇందులో వ్యవసాయం చేసే పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నారట. వైష్ణవ్‌ తేజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఈ సినిమా సెట్‌లో తీసిన వీడియోను రకుల్‌ సోషల్ ‌మీడియాలో షేర్‌ చేశారు. వర్షం కురుస్తున్నా షూటింగ్‌ ఆగలేదన్నారు. ‘వికారాబాద్‌లోని రాతి కొండలపై షూట్‌ చేస్తుండగా వర్షం మొదలైంది. వర్షం నుంచి కెమెరాలను కాపాడుకుంటున్నాం. కొవిడ్‌-19 సమస్యతో ఓ పక్క మనం ఇబ్బందిపడుతుంటే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు మరో అడ్డంకిగా మారాయి’ అని ఆమె పేర్కొన్నారు. వర్షంలోనూ చిత్ర బృందం సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ కనిపించింది.

రకుల్‌ ‘మన్మథుడు 2’లో గత ఏడాది తెలుగు తెరపై కనిపించారు. ఆపై హిందీ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు దక్షిణాది చిత్రాలున్నాయి. కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కాజల్‌, సిద్ధార్థ్‌ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని