‘వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం వారి హక్కు’  - Workers Have A Legal Right To Bathroom And Water Breaks
close
Updated : 04/09/2020 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం వారి హక్కు’ 

ఆస్ట్రేలియా కోర్టు సంచలన నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశాల్లోని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు మరుగుదొడ్డికి వెళ్లడానికి, మంచినీరు తాగడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయిస్తుంటాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు ఈ విషయంలో సంచలన తీర్పు వెల్లడించింది. మరుగుదొడ్డికి, లేదా మంచినీరు తాగడానికి వెళ్లడం ఉద్యోగుల న్యాయపరమైన హక్కు అని, వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్లొచ్చని తీర్పు వెల్లడించింది. 

ఆస్ట్రేలియాలో అనేక సంస్థలు వారి ఉద్యోగులకు వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రతి నాలుగు గంటలకు ఒకసారి 10 నిమిషాల పాటు విరామం ఇస్తుంటాయి. అయితే ఆస్ట్రేలియాలో ఓ రెస్టరెంట్‌.. దాని బ్రాంచ్‌ల్లో ఉద్యోగులకు ఆ సమయం కేటాయించట్లేదట. గతేడాది ఈ మేరకు ఉద్యోగులకు యాజమాన్యం తమ సోషల్ ‌మీడియా ప్రైవేటు ఖాతాలో పోస్టు కూడా పెట్టింది. కొన్నాళ్ల కిందట ఆ రెస్టారెంట్‌ పని చేసే ఓ మహిళా ఉద్యోగికి ఇలా చాలా సార్లు సమయం ఇవ్వకుండా పనులు చేయించుకున్నారట. దీంతో ఆమె ఉద్యోగం మానేసి న్యాయపోరాటానికి దిగింది. ఆమెకు అండగా కార్మికుల సంఘం నిలబడింది. ఆమె తరఫున కోర్టుకెక్కింది. ఆ ఉద్యోగికి వ్యక్తిగత అవసరం ఏర్పడితే.. రెస్టారెంట్‌ యాజమాన్యం షిఫ్ట్‌ పూర్తయిన తర్వాతే వెళ్లాలంటూ కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఆ పోస్టు ఆధారంగా విచారణ జరపాలని కోర్టును కోరింది. ఆ మహిళా ఉద్యోగి తన 10 నిమిషాల విరామం సమయంలోనూ పనిచేయించుకొని డబ్బులు ఇవ్వలేదని దీని వల్ల తను 800 డాలర్లు నష్టపోయానని కోర్టుకు తెలిపింది. 

ఈ కేసుపై కొన్నాళ్లుగా విచారణ జరుపుతున్న కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు తీర్చుకోవడం న్యాయపరమైన హక్కు అని పేర్కొంది. విధుల్లో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు అనుమతివ్వాలని స్పష్టం చేసింది. అలాగే నష్టపోయిన ఆ మహిళా ఉద్యోగికి వెయ్యి డాలర్లు పరిహారం చెల్లించాలని రెస్టారెంట్‌ను కోర్టు ఆదేశించింది. ఆమెకే కాదు.. అలా పది నిమిషాల విరామం ఇవ్వకుండా ఉన్న ఉద్యోగులందరికీ పరిహారం చెల్లించాలని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని