కరోనాతో.. తగ్గిన కర్బన ఉద్గారాలు - World Carbon Dioxide Emissions
close
Published : 11/12/2020 23:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో.. తగ్గిన కర్బన ఉద్గారాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, పర్యావరణ పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది 7% మేర బొగ్గుపులుసు వాయువు‌ ఉద్గారాల విడుదల తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావటంతో పాటు కార్లు, విమానాల వినియోగం పూర్తిగా తగ్గిపోవటం ఇందుకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఎర్త్‌ సిస్టం సైన్స్‌ డేటా మ్యాగజైన్‌లో ఓ కథనం ప్రచురితమైంది. గతంతో పోల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ రికార్డు స్థాయిలో పడిపోయిందని, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో వెల్లడైంది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా 36.4 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదల కాగా... ఈ ఏడాది 34 బిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు తగ్గింది. అమెరికాలో ఉద్గారాల విడుదల 12 శాతం మేరకు, ఐరోపా దేశాల్లో ఇది 11 శాతం మేర క్షీణించిందని నిపుణుల బృందం తెలిపింది. అయితే చైనాలో మాత్రం 1.7 శాతమే తగ్గినట్లు పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని