
తాజా వార్తలు
‘సారీ లేడీస్’.. రోహన్..!
హైదరాబాద్: వారం వారం సెలబ్రిటీల అల్లరితో ప్రేక్షకులను కనువిందు చేస్తోంది ‘వావ్-3’. సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఎంటర్టైన్మెంట్ గేమ్ షో ‘వావ్-3’. ఎప్పటిలాగే వచ్చే శనివారం ‘వావ్’ సెట్ లో పలువురు సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. ప్రేక్షకాదరణ పొందుతున్న చిన్నారులు యోధ, దీవెన, రోహన్, సహృద.. సాయికుమార్‌తో కలిసి వావ్ సెట్ లో నవ్వులు పూయించారు.
షోలో భాగంగా ‘దీవెన.. సాయికుమార్ అన్నయ్య అనగా.. యోధ.. అన్నయ్య ఏంటి అని అడుగగా.. ఈ విధంగానైనా ప్రోమోలో ఎక్కువగా పడతాం.. దానికి సాయికుమార్ కాదమ్మా.. సాయికుమార్ తాతయ్య.. అనాలి’ అని సరదాగా వరుస పంచులతో కడుపుబ్బా నవ్వించారు. అలాగే సాయికుమార్ దీవెనను ‘నీకు ఏమిష్టం అని అనగా.. చాక్లెట్స్ అనగా.. దానికి రోహన్ అందుకొని లిప్‌స్టిక్, ఐలాషెస్ ఇష్టం అని చెప్పు.. ఎందుకు సర్.. ఇవన్నీ పెట్టుకుంటారు.. అని చెప్పగా.. బయటకు వెళ్లు.. లేడీస్ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు’ అని సాయికుమార్ అటపట్టించగా.. దానికి రోహన్ ‘సారీ లేడీస్.. మీరు చాలా అందంగా ఉంటారు.. మీ ఎర్ర లిప్‌స్టిక్ అదుర్స్’ అంటూ ఆద్యంతం నవ్వుల వర్షం కురిపించారు. అంతేకాకుండా షోలో భాగంగా ‘బిర్యానీకి ప్రసిద్ధి చెందిన నగరం ఏది?’ అని సాయికుమార్ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా రోహన్ ‘హైదరాబాద్’ అనగా.. అందుకు సాయికుమార్ నవరసాలలో హైదరాబాద్ పేరును చెప్పమనగా.. రోహన్ ఆ విధంగా చెబుతూ అందరినీ మెప్పించారు. ఆద్యంతం నవ్వులతో సాగే షోలో ఈ అల్లరి బుడతలు చేసిన హంగామాను వీక్షించాలంటే వచ్చే మంగళవారం (డిసెంబర్ 8)న ప్రసారం కానున్న ‘వావ్-3’ చూడాల్సిందే.. అప్పటివరకు సరదాగా సాగే ఈ ప్రోమోను చూసేయండి..!
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
