‘మఫ్తి’ దర్శకుడితో యశ్‌ చిత్రం! - Yash film with Mufti director
close
Published : 13/02/2021 22:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మఫ్తి’ దర్శకుడితో యశ్‌ చిత్రం!

ఇంటర్నెట్‌డెస్క్: ‘కేజీఎఫ్’‌ చిత్రంతో ఒక్కసారిగా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు యశ్‌‌. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘కేజీఎఫ్‌2’లో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే కన్నడలో వచ్చిన ‘మఫ్తి’ చిత్ర దర్శకుడు నార్తన్‌తో కలిసి ఓ చిత్రం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘యశ్‌ -19’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్టు పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రకటన కూడా రాబోతుందని యశ్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

నార్తన్‌ తొలుత ప్రశాంత్‌నీల్‌ దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించారు. తొలిసారిగా ‘మఫ్తి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ‘కేజీఎఫ్‌2’ చిత్ర టీజర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. అధీరా పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తుండగా.. రవీనా టాండన్, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు రెండో భాగంలో కనిపించనున్నారు.

ఇదీ చదవండి..

ఆలోచనల్లో  మునిగిన పాయల్‌.. అప్సర భక్తి..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని