కేజీఎఫ్‌-2: షూటింగ్‌లో పాల్గొన్న రాకీ! - Yash starts shooting for KGF 2
close
Published : 09/10/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేజీఎఫ్‌-2: షూటింగ్‌లో పాల్గొన్న రాకీ!

హైదరాబాద్‌: యశ్‌, శ్రీనిధి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం కేజీఎప్‌ చాప్టర్‌ -2. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఆగస్టు చివరి వారంలో ప్రకాష్‌ రాజ్‌, మాళవిక మధ్య సాగే సన్నివేశాలను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర సెట్‌లోకి హీరో యశ్‌ అడుగుపెట్టారు. బీచ్‌ వద్ద నిల్చున్న చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కేజీఎఫ్‌-1 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు పెరిగాయి. సంజయ్‌దత్‌, ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఈ భాగంలో నటిస్తుండడం అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో కీలకమైన అధీర పాత్రలో సంజయ్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యం కారణంగా చిత్రీకరణకు దూరంగా ఉన్నారు. దీంతో షూటింగ్‌ కొంచెం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు మొదటి భాగంలో అనంత్‌నాగ్‌ పోషించిన పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ పోషిస్తున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ చిత్రబృందం ఖండించింది. వీలైనంత తొందరగా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని