రియల్‌ టైగర్‌తో అమితాబ్‌ పోరాటం - You have no idea how strong a tiger is posted Amitabh bachchan
close
Updated : 02/11/2020 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియల్‌ టైగర్‌తో అమితాబ్‌ పోరాటం

‘ఆ అగ్ని పరీక్షను మర్చిపోలేను..’ 

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 1977లో నిజమైన పులితో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘ఖూన్ పసీనా’ సినిమాలోని సన్నివేశం షూటింగ్‌ సమయంలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. రేఖ, వినోద్‌ ఖన్నా, ఖాదర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. రాకేష్‌ కుమార్‌ దర్శకుడు. యాక్షన్‌ క్రైమ్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ అందుకుంది. ఇందులోని ఓ సన్నివేశంలో బోను నుంచి తప్పించుకున్న పులితో అమితాబ్‌ పోరాడి.. తిరిగి దాన్ని బోనులో బంధిస్తారు. అది నిజమైన పులి అని, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని బిగ్‌బి పేర్కొన్నారు.

‘‘ఖూన్‌ పసీనా’ సినిమా కోసం కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ జాకెట్‌ నాకిచ్చినప్పుడు నేను రియల్‌ టైగర్‌తో పోరాడాల్సి ఉంటుందని గ్రహించలేకపోయా. టైగర్‌ ఎంత దృఢంగా ఉంటుందో మీకు తెలియదు. ఆ అగ్ని పరీక్షను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని ఆయన పోస్ట్‌ చేశారు. దీనికి నెటిజన్లతోపాటు సినీ ప్రముఖులు సైతం కామెంట్లు చేశారు. ‘టైగర్ మీతో పోరాడాలి.. అది కూడా ఇలానే అనుకుని ఉంటుంది’ అని ఫరా ఖాన్‌ కుంద్రా పేర్కొన్నారు. ఇది ప్రమాదంతో కూడుకున్నదని, అమితాబ్‌ ధైర్యానికి మెచ్చుకోవచ్చని మరికొందరు కామెంట్లు చేశారు.

సినిమా కోసం ఎంతటి సాహసం చేయడానికైనా అమితాబ్‌ వెనుకాడరు. గత 50 ఏళ్లుగా ఆయన సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. 78 ఏళ్ల వయసులోనూ అదే జోరుతో కొత్త సినిమాలకు సంతకం చేసి, నటిస్తున్నారు. అనేక ప్రకటనలు, షోలలోనూ కనిపిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని