సరికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌ - Young tiger NTR NEW look goes viral
close
Published : 16/10/2020 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను అలరించారు. అయితే, ఇది కొత్త సినిమా కోసం కాదండోయ్‌. ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా ఆయన స్టిల్స్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. తీక్షణమైన చూపులతో ఉన్న ఎన్టీఆర్‌ స్టిల్స్‌ అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కీలక పాత్రలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు.

ఇందులో తారక్‌ ‘కొమరం భీమ్‌’గా, చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. చారిత్రక కథా నేపథ్యాన్ని పోలిన కల్పితగాథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ లుక్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఆయా సన్నివేశాలను ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం షూట్‌ చేసింది. దసరా కానుకగా అక్టోబరు 22న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తారక్‌ నటించిన వాణిజ్య ప్రకటనకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం, చాలా రోజుల తర్వాత తమ అభిమాన కథానాయకుడు దర్శనమివ్వడంతో ఫ్యాన్స్‌ తెగ ఆనందపడిపోతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని