ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు:యువీ - Yuvraj Singh Pray sanjay dutt Speedy Recovery
close
Updated : 12/08/2020 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు:యువీ

ముంబయి: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శ్వాసకోస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. 

‘‘సంజయ్‌ దత్‌.. ఈ సమయంలో మీరు ఫైటర్‌లా పోరాడాలి. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు మీరు మరింత దృఢంగా ఉండాలి. మీరు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. గతంలో యువరాజ్‌ సింగ్‌ ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ బారినపడి మెరుగైన చికిత్స తీసుకొని కోలుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు వైద్యం నిమిత్తం కొంచెం విరామం తీసుకుంటున్నట్లు సంజయ్‌ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘వైద్యం నిమిత్తం నా పని నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, స్నేహితులు నాతోనే ఉన్నారు. నా ఆరోగ్యం పట్ల వదంతులు సృష్టించొద్దని కోరుతున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా’’అని ట్వీటర్‌లో పేర్కొన్నారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని