బుమ్రా రికార్డుకు వికెట్ దూరంలో చాహల్‌ - Yuzvendra Chahal On The Brink Of Equalling Jasprit Bumrahs Record For India In Mens T20s
close
Published : 06/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుమ్రా రికార్డుకు వికెట్ దూరంలో చాహల్‌

ఇంటర్నెట్‌డెస్క్: కాన్‌బెర్రా వేదికగా జరిగిన భారత్×ఆస్ట్రేలియా తొలి టీ20లో స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ (3/25) అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. జడేజాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన అతడు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అంతేగాక పొదుపుగా బౌలింగ్‌ చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే చాహల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో వికెట్‌ సాధిస్తే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాతో సమానంగా నిలుస్తాడు. ఫామ్‌లో ఉన్న చాహల్ ఆసీస్‌తో ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా అనిపిస్తోంది.

భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్‌-5 బౌలర్లుగా బుమ్రా, చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కొనసాగుతున్నారు. బుమ్రా 49 ఇన్నింగ్స్‌ల్లో 59 వికెట్లు సాధించగా.. చాహల్ 43 ఇన్నింగ్స్‌ల్లోనే 58 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి స్థానాల్లో అశ్విన్ (52 వికెట్లు, 46 ఇన్నింగ్స్‌లు), భువీ (41 వికెట్లు, 43 ఇన్నింగ్స్‌లు), కుల్‌దీప్‌ (39 వికెట్లు, 20 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. కాగా, సిడ్నీ వేదికగా ఆదివారం ఆసీస్‌తో భారత్‌ రెండో టీ20 ఆడనుంది. ఈ పోరులో విజయం సాధిస్తే మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

ఇదీ చదవండి

కోహ్లీసేన జోరు కొనసాగించేనా?

11 ఏళ్లైనా జడ్డూను చిన్నచూపు చూస్తున్నారుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని