పాపం యూజీ.. అవుననక తప్పదు మరి! - Yuzvendra Chahals Fiancee dhana shri Trolls Him
close
Published : 11/09/2020 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాపం యూజీ.. అవుననక తప్పదు మరి!

చాహల్‌పై పంచ్‌ విసిరిన కాబోయే భార్య

దుబాయ్‌: మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ టీమ్‌ఇండియాలో అందరినీ కొంటెగా కవ్విస్తుంటాడు. కోహ్లీ సహా ఎవ్వరినీ వదిలిపెట్టడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మనైతే మరీనూ. అటు మైదానంలో ఇటు సోషల్‌ మీడియాలో ఎక్కడ దొరికినా ఏ మాత్రం ఆలోచించడు. ఏదో ఒక కామెంట్‌ చేస్తూ అలరిస్తుంటాడు. అందరినీ ఆటపట్టించే అతడికి గురువారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఏంటంటారా?

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతున్న యూజీ మైదానంలో విపరీతంగా సాధన చేస్తున్నాడు. జట్టు సభ్యులను అలరిస్తూ.. సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అలాగే టీవీ షూటింగుల్లోనూ పాల్గొంటున్నాడు. ఏబీ డివిలియర్స్‌తో షూటింగ్‌లో పాల్గొన్న వీడియోను తాజాగా అతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అందులో ఓ వీల్‌ఛైర్‌పై కూర్చొన్నాడు. అతడిని ఏబీ అటు ఇటూ తిప్పుతున్నాడు. బ్యాగ్రౌండ్‌లో జాన్‌ డెన్వర్స్‌ ‘కంట్రీరోడ్స్‌’ పాట వస్తోంది. దానికి యూజీ ‘టేక్‌ మీ హోమ్‌’ అనే వ్యాఖ్య జత చేశాడు.

అతడు పెట్టిన వీడియోకు కాబోయే సతీమణి ధనశ్రీ వర్మ స్పందించింది. ‘నేను నీ పక్కన లేనంత వరకే సేదతీరు’ అని పంచ్‌ విసిరింది. దాంతో నెటిజన్లు మొత్తం నవ్వుతున్న ఏమోజీలు పెట్టారు. చివరికి చాహల్‌ ‘అవునవును..’ అని బదులివ్వక తప్పలేదు. కొన్నాళ్ల క్రితమే యూజీ, ధనశ్రీ రోకా వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని