పబ్లిక్‌ ఇష్యూకు రానున్న జొమాటో - ZOMATO IN FUTURE COMING FOR PUBLIC ISSUE
close
Published : 11/09/2020 20:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పబ్లిక్‌ ఇష్యూకు రానున్న జొమాటో

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. కానీ, ఆ కంపెనీ ఇండియా, అమెరికాలోని ఏ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అవుతుంది అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఆహార సరఫరా సంస్థ విలువ రూ.350 కోట్లుగా ఉంది.  సంస్థ సీఈవో దీపిందర్‌ గోయల్‌ మాట్లాడుతూ...‘వచ్చే సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఐపీవోగా రావడానికి మా బృందాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. మా బిజినెస్‌ వృద్ధి బాటలో కొనసాగుతోంది. అందువల్ల మా బృందానికి కృతజ్ఞతలు తెలిపాలి. వచ్చే సంవత్సరం లోగా మేం మా ఉద్యోగుల విలువను పెంచాలనుకుంటున్నాం ’ అని చెప్పారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కంపెనీ ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ కావాలంటే అంతకు ముందే ఇండియాలో నమోదు కావాల్సి ఉంటుంది. మేక్‌ మై ట్రిప్‌ అంకుర సంస్థ మారిషస్‌ కేంద్రంగా అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయింది. చాలా వరకు భారతదేశంలోని అంకుర పరిశ్రమలు పబ్లిక్‌ ఇష్యూలకు దూరంగా ఉన్నాయి. పాలసీ బజార్‌, నైకా, ఫ్రేష్‌ వర్క్స్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో పబ్లిక్‌ ఇష్యూకు రానున్నట్టు సమాచారం. తాజా సమాచారం మేరకు భారతీయ కంపెనీలు ఇండియాలో లిస్ట్‌ కాకుండానే అమెరికాలో నమోదు కావచ్చని మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ముసాయిదా బిల్లును విడుదల చేయబోతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని