రెస్టారెంట్ల వద్ద టేక్‌అవే  సేవలపై సున్నా కమీషన్‌: జొమాటో - Zero commission on takeaway services at restaurants Zomato
close
Updated : 19/11/2020 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెస్టారెంట్ల వద్ద టేక్‌అవే  సేవలపై సున్నా కమీషన్‌: జొమాటో

ముంబయి: రెస్టారెంట్‌ భాగస్వాముల వద్ద లభించే టేక్‌అవే సేవలను సున్నా కమీషన్‌కే అందించనున్నట్లు ఆహార డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. హోటల్‌ పరిశ్రమ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంది. కరోనా సంక్షోభం నుంచి ఆహార డెలివరీ వ్యాపారం బలంగా పుంజుకుందని, అయితే వృద్ధి ఒకే విధంగా లేదని   వెల్లడించింది. తమ ఆహార డెలివరీ విభాగం కొవిడ్‌-19 మునుపటి స్థాయి స్థూల వ్యాపార విలువ (జీఎంవీ)తో పోలిస్తే 110 శాతంగా ఉందని జొమాటో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఆహార డెలివరీ సురక్షితమేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వివరించింది.. మార్చిలో ప్రారంభమైన మొదటి లాక్‌డౌన్‌ నుంచి 13 కోట్లకు పైగా ఆర్డర్లను డెలివరీ చేశామని, ఆహారం లేదా ప్యాకింగ్‌ ద్వారా ఒక్క కొవిడ్‌-19 కేసు కూడా నమోదుకాలేదని పేర్కొంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని