ధోనీ ఆ నగరం నుంచి వచ్చాడు కాబట్టి.. - Zomato gives hilarious reply
close
Published : 17/08/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీ ఆ నగరం నుంచి వచ్చాడు కాబట్టి..

నెటిజన్‌కు జొమాటో సమాధానం

దిల్లీ: ఆగస్టు 15న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. క్రికెట్‌కు ధోనీ అందించిన సేవలను గౌరవించుకోవాలని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థ జొమాటో ఝార్ఖండ్ రాజధాని రాంచి వాసులకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది రాంచి నగర ప్రజలకు చాలా ఆనందాన్నిచ్చే విషయం. కానీ వేరే ప్రాంతానికి చెందిన వారు మాత్రం ఈ ఆఫర్‌పై కాస్త అసంతృప్తి వెళ్లగక్కారు. ఓ నెటిజన్ ఏకంగా జొమాటోకు తన అభ్యర్థనను వెలిబుచ్చాడు. ‘అతడు రాంచి నుంచి వచ్చినప్పటికీ, ఆ లెజెండ్‌ను దేశం మొత్తం ప్రేమిస్తోంది. ఎందుకు ఈ ఆఫర్‌ను దేశం మొత్తానికి అందించలేదు?’ అని ప్రశ్నించాడు. దానికి జొమాటో తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘భారత దేశానికి ఒక లెజెండ్‌ను బహుమతిగా ఇచ్చిన నగరానికి ఈ బహుమతి!’ అని స్పందించింది. కాకపోతే ఈ సమాధానం అందరిని మెప్పించలేకపోయింది. అది వేరే విషయం. ఇదిలా ఉండగా.. ధోనీ శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా తన రిటర్మెంట్‌ ప్రకటనను తెలియజేస్తూ..తనను ప్రేమించి, సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపాడు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని