టీకా మూడోదశ ప్రయోగాలకు జైడస్‌ క్యాడిలా - Zydus Cadila gets DGCI approval for phase 3 clinical trials
close
Published : 05/12/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా మూడోదశ ప్రయోగాలకు జైడస్‌ క్యాడిలా

దిల్లీ: తమ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల నిర్వహణకు భారత ప్రభుత్వ అనుమతి లభించినట్టు ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా ప్రకటించింది. పెగిహెప్‌ చికిత్సా విధానానికి సంబంధించి ప్రయోగాలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు సంస్థ ప్రకటించింది.

టీకా రెండోదశ ప్రయోగాలు గత నెల పూర్తయిన సంగతి తెలిసిందే. రెండో దశ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, బాధితులపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితం వచ్చిందని మేనేజింగ్‌ డైరక్టర్‌ షర్విల్‌ పటేల్‌ అన్నారు. తాజా అనుమతుల నేపథ్యంలో.. తాము దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 25 కేంద్రాల్లో 250 మంది బాధితులపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తామని సంస్థ వెల్లడించింది. కొవిడ్‌ 19 మహమ్మారి బారినుంచి  ప్రపంచాన్ని తప్పించేందుకు సులభమైన, సురక్షితమైన మార్గాన్ని కనిపెట్టేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని