మెగాస్టార్‌తో పనిచేయడం నా డ్రీమ్‌: తమన్‌ - a biggest dream for any composer headphone its my turn to show my love towards our boss black heart shri megastar raised fist kchirutweets gaaru my dear brother jayam_mohanraja
close
Published : 21/01/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాస్టార్‌తో పనిచేయడం నా డ్రీమ్‌: తమన్‌

హైదరాబాద్‌: వరుసపెట్టి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని ఇస్తూ.. దూసుకుపోతున్నారు సంగీత దర్శకుడు తమన్‌. తాజాగా ఆయన ఒక క్రేజీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు. మెగాస్టార్‌ చిరు ప్రధాన పాత్రలో మళయాళం సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి స్వరాలు సమకూర్చేందుకు తమన్‌ సిద్ధమవుతున్నారు. ఆ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయనే వెల్లడించారు. బుధవారం  ట్విటర్‌లో ‘మై బాస్‌ మెగాస్టార్‌ చిరుకు నా ప్రేమను చూపించే అవకాశం ఇప్పుడొచ్చింది. అలాగే నా ప్రియసోదరుడు మోహన్‌రాజాకు కూడా..ఇక లూసిఫర్‌ సంగీత ప్రయాణం మొదలైంది’ అంటూ తమన్‌ రాసుకొచ్చారు. గతంలో రామ్‌ చరణ్ చిత్రం ‘బ్రూస్‌లీ’లో చిరు కామియో ఎంట్రీకి తమన్‌ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.   మెగాస్టార్‌ చిరు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ పూర్తి కాగానే ‘లూసిఫర్‌’సెట్స్‌పైకి వెళ్లనుంది. తమిళంలో ‘తనీఓరువన్‌’ వంటి హిట్‌ సినిమాను మలిచిన దర్శకుడు మోహన్‌రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 

ఇవీ చదవండి!

అప్పట్లో ఎంతో బాధపడ్డా: విజయ్‌ దేవరకొండ

వీడియో లీక్‌.. రూ.25 కోట్లు డిమాండ్‌
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని