ఇంతకీ ఇతను ఎవరు: బ్రహ్మాజీ - a fake account on brahmaji name
close
Published : 24/05/2021 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంతకీ ఇతను ఎవరు: బ్రహ్మాజీ

హైదరాబాద్‌: స్టార్‌ హీరో తారక్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఆయన త్వరితగతిన కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని నందమూరి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్‌ ఆరోగ్య పరిస్థితిని తెలియచేస్తూ వచ్చిన ఓ ట్వీట్‌ సోమవారం ఉదయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌ పూర్తిగా కోలుకున్నారని.. ఆయనకు నెగెటివ్‌ వచ్చిందని.. పేర్కొంటూ నటుడు బ్రహ్మాజీ పేరుతో ఉన్న ఓ ప్రొఫైల్‌ నుంచి ట్వీట్‌ బయటకు రావడంతో అందరూ నిజమేనని ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, సదరు ట్వీట్‌ గురించి నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ‘ఇంతకీ ఈ ట్వీట్‌ చేసిన బ్రహ్మాజీ ఎవరు?’ అని ప్రశ్నించారు. దాంతో బ్రహ్మాజీ పేరుతో ఉన్న ఫేక్‌ అకౌంట్‌ను ట్విటర్‌ డిలీట్‌ చేసింది. మరోవైపు ఫేక్‌ ట్వీట్‌ అని తెలుసుకున్న నెటిజన్లు.. కొంత ఆగ్రహానికి లోనైనప్పటికీ తారక్‌ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని