ఆయనతో కలిసి నటించాలనే నా కల నిజమైంది - a huge milestone in my career emraan hashmi on working with amitabh bachchan
close
Published : 13/03/2021 20:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయనతో కలిసి నటించాలనే నా కల నిజమైంది

ఇంటర్నెట్‌ డెస్క్: అమితాబ్‌ బచ్చన్‌ - ఇమ్రాన్‌ హష్మి కలిసి తొలిసారిగా నటిస్తున్న చిత్రం ‘చెహ్రే’. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రూమీ జాఫరీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి, సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించడంపై ఇమ్రాన్‌ మాట్లాడుతూ..‘‘ఎంతో కాలంగా అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేయాలనే నా నిరీక్షణ ఫలించింది. బాలీవుడ్‌ చిత్రసీమలో ఆయనను చూస్తూ పెరిగివాడిని. పరిశ్రమలోని ప్రతి నటుడు ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటారు. నా వరకు అయితే ఆయన కలిసి నటించే అవకాశం వచ్చినందుకు నా జీవితంలో ఓ మైలురాయిని సాధించానని అనిపిస్తుంది. ‘చెహ్రే’ సినిమా చిత్రీకరణ సెట్లో నేను ఆయనను సహనటుడు అనడం కంటే, నాకొక బోధకుడు, స్నేహితుడిగా ఉన్నారంటే అతియోశక్తి కాదేమో. తొలుత అమితాబ్‌తో కలిసి నటించాలంటే కొంత భయమేసింది. సెట్లో ఆయన చాలా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటారు. చెప్పిన సమయానికే సెట్లోకి చేరుకుంటారు. ఇది నేను ఆయన్నుంచి నేర్చుకున్న గొప్ప విషయం. వృత్తి పట్ల ఆయనకుండే గౌరవం, మమకారం అలాంటిది మరి. నాకే కాదు చిత్రసీమలోని ప్రతి ఒక్కరు ఆయన క్రమశిక్షణ, నటన పట్ల అమితాబ్‌కి ఉన్న ప్రేమ - గౌరవాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అందుకే  ప్రేక్షకులకు ఆయనంటే ఆరాధన, గౌరవం అభిమానం’’అంటూ తెలిపారు.

‘చెహ్రే’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ న్యాయవాది వీర్‌ పాత్రలో నటిస్తుండగా, ఇమ్రాన్‌ వ్యాపారవేత్త కరణ్‌ ఒబెరాయ్‌గా నటిస్తున్నారు. ఇంకా ఇందులో క్రిస్టల్ డిసౌజా, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, రఘుబీర్ యాదవ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని