సైబర్‌ మోసం.. ఇది కూడా హానికరమే - a lot has been said about the issue i have faced recently venky kudumula
close
Published : 05/03/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సైబర్‌ మోసం.. ఇది కూడా హానికరమే

దర్శకుడు వెంకీ కుడుముల

ఇంటర్నెట్‌ డెస్క్: సినీ దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల ఓ సైబర్‌ మోసానికి గురైయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రాన్ని ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నామినేట్‌ చేస్తామంటూ నమ్మబలికి ఆయన్నుంచి దాదాపు రూ.63,600  కట్టించుకున్నారు. అంతేకాదు ఇంకా డబ్బు కట్టాలంటూ నమ్మబలికారు. వెంకీకి అనుమానం వచ్చి ఆరా తీయగా, అదంతా బోగస్‌ అని తేలడంతో తను మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ మోసంపై వెంకీ కుడుముల స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ఇటీవల జరిగిన సైబర్‌ మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశా. దానిపై నాకు చాలా కాల్స్ వచ్చాయి. దీనిపై మౌనంగా ఉండాలా? లేదా? మనకు జరిగిన విషయాన్ని బయటకు చెప్పాలా? అనేక అంశాలు ఉన్నాయి. కానీ, నేను మాత్రం రెండో దాన్నే ఎంచుకున్నా. నా స్నేహితుడు నవీన్‌ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి నా నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. నేను తెరకెక్కించిన ‘భీష్మ’ చిత్రం చూసి మెచ్చుకొన్నాడు. అంతేకాదు ఈ సినిమాని జాతీయ అవార్డుకు దరఖాస్తు చేసుకోసుమని చెప్పాడు. దరఖాస్తు చేయడంలో తప్పులేదని భావించి ముందుకు వెళ్లా. అవార్డుకు అవసరమయ్యే పత్రాలను సమర్పించాలని నా అసిసోయేట్‌ డైరక్టర్‌ని సూచించా. అఫ్లికేషన్ ఫీజు కోసం రూ.63,600 మొత్తం చెల్లించా’’

‘‘మళ్లీ కొంత డబ్బు పంపాలని కోరాడు. దాంతో నేను అతని బ్యాంక్‌ వివరాలు గురించి లోతుగా తెలుసుకున్నా. ఆ ఖాతా ఫిల్మ్ కార్పోరేషన్‌ది కాదని తెలిసింది. ఇదే విషయాన్ని నా స్నేహితుడు నవీన్‌ని అడగ్గా, తానెప్పూడూ అతన్ని కలుసుకోలేదని చెప్పాడు. ‘రెండు సంవత్సరాల్లో నాకు రెండు సార్లే సందేశాలు పెట్టినట్లు గుర్తు’ అని చెప్పాడు.  అంటే మోసగాళ్లు ఏ విధంగానైనా మన దగ్గరకు రావచ్చు. నిజంగా కొంతమంది నటిస్తూ ఉండవచ్చు’’

‘‘చాలామంది స్నేహితులు నన్ను పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని సూచించారు. అంతేకాదు జరిగిందేదో జరిగింది. కామ్‌గా ఉండాలంటూ నన్ను కోరారు. కానీ, మా చిత్రసీమకు చెందిన వారే కాదు బయటి వ్యక్తులు కూడా మోసం చేసే అవకాశం ఉంది. అందుకే మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలనే, నేను ముందుకెళ్లి ఫిర్యాదు చేశా. తప్పు జరిగితే జరిగింది. ఇలాంటి తప్పు మిగతావాళ్లకి జరగకూడదని ఫిర్యాదు చేశా. ‘‘పొగ తాగటం, మద్యం సేవించటం మాత్రమే కాదు.. అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరం’’. సమాజంలో ఏదైనా తప్పు జరిగితే మీ గొంతు పెంచాలనీ మీ అందరినీ కోరుతున్నాను’’ అంటూ వెంకీ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని