బాబాయ్‌-అబ్బాయ్‌ల మల్టీస్టారర్‌ ఉండనుందా? - a multi-starrer with pawan kalyan and ram charan oon the cards
close
Published : 19/01/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాబాయ్‌-అబ్బాయ్‌ల మల్టీస్టారర్‌ ఉండనుందా?

హైదరాబాద్‌: మెగా హీరోలు పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌ చిత్రం త్వరలో పట్టాలెక్కబోతుందా? అదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా.. ఒక ప్రముఖ నిర్మాత ఇదే పనిలో ఉన్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరోలు, జూనియర్‌ హీరోలు కలిసి నటిస్తున్న సినిమాలు బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్‌ యువహీరోలందరితో కలిసి వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు.

గతంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ హీరోలుగా ఒక మల్టీస్టారర్‌ తీయాలని ప్రముఖ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి భావించారు. కానీ అదెందుకో పట్టాలెక్కలేదు. ఇప్పుడు బాబాయ్‌, అబ్బాయ్‌లను హీరోలుగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించాలని ఆ ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తునట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. ఈ కాంబో తెరపై కనిపిస్తుందో లేదో! అయితే ‘వకీల్‌ సాబ్‌’తో పాటు మరో రెండు చిత్రాలతో పవన్‌ బిజీ కాగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టేందుకు రామ్‌చరణ్‌, తారక్‌తో కలిసి రెడీ అవుతున్నాడు!

ఇవీ చదవండి!

‘గని’గా వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌!

షారుక్‌తో దీపికా ‘పఠాన్‌’!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని