‘ఉప్పెన’ టీమ్‌కు చిరు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు - a surprise gift and appreciation letter from megastar chiranjeevi garu
close
Published : 22/02/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ టీమ్‌కు చిరు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు

హైదరాబాద్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా వైష్ణవ్‌, కృతి, విజయ్‌ సేతుపతిల నటన బుచ్చిబాబు టేకింగ్‌ సినిమాను విజయపథంలో నడిపాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘ఉప్పెన’ టీమ్‌ను అభినందించడంతో పాటు, సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు పంపారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘‘డియర్‌ డీఎస్పీ ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువు పట్టు. స్టార్‌ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతం అందిస్తావో.. చిత్రం రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాషన్‌తో మ్యూజిక్‌ను ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నువ్వు నిజంగా రాక్‌ స్టార్‌.. ప్రేమతో మీ చిరంజీవి’’ అని చిరు పంపిన లెటర్‌ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా చిరంజీవికి దేవిశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. కథానాయిక కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్‌ తదితరులకు చిరు గిఫ్ట్‌లు పంపారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని