పారిపోవాలనుకుంది.. కానీ ఇరుక్కుపోయింది! - a women who wants to escape from covid care centre strucks in hospital window
close
Published : 16/03/2021 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారిపోవాలనుకుంది.. కానీ ఇరుక్కుపోయింది!

పుణె: మహారాష్ట్రలో కరోనా సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకునేందుకు యత్నించిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. కరోనా సంరక్షణ కేంద్రం నుంచి పారిపోయే క్రమంలో కిటికీ ఊచల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది. ఈ ఘటన పుణెలోని యరాండవాణెలో చోటుచేసుకుంది.

పుణె సహా మహారాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు పెరిగిపోవడంతో కట్టడి కోసం ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రత్యేక సంరక్షణ కేంద్రంలో ఉంచి పుణె నగరపాలక సంస్థ చికిత్స చేయిస్తోంది. పుణెలోని యరాండవాణె కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 18ఏళ్ల యువతికి చికిత్స అందిస్తున్నారు. ఆ కేంద్రంలో ఉండటం ఇష్టం లేని యువతి అక్కడి నుంచి పారిపోవాలని యత్నించింది. ఆ భవనం కిటికీ ఊచల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి మధ్యలో ఇరుక్కుపోయింది. బయటకు రాలేక, లోపలకు వెళ్లలేక నరకయాతన అనుభవించిన యువతి గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న కొవిడ్‌ కేంద్రం నిర్వాహకులు పరిస్థితిని గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక హైడ్రాలిక్‌ కట్టర్‌ సాయంతో కిటికీ ఊచలను కత్తిరించి యువతిని కాపాడారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని