‘‘ఎవరికోగాని...’’ ఫుల్‌సాంగ్‌ వీడియో వచ్చేసింది - aadisurbhi sashi movie full video song yevarikogani
close
Published : 08/05/2021 14:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘ఎవరికోగాని...’’ ఫుల్‌సాంగ్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్:  ఆది కథానాయకుడిగా నటించిన ప్రేమకథా చిత్రం ‘శశి’. శ్రీనివాస్‌ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి కథానాయికగా నటించింది. శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్‌.పి.వర్మ, చావలి రామాంజనేయులు,  చింతలపూడి శ్రీనివాసరావులు కలిసి నిర్మించారు. సినిమా ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘ఎవరికోగాని..’ అంటూ సాగే ఫుల్‌సాంగ్‌ వీడియో యూట్యూబ్‌లో వచ్చేసింది. పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అదించారు. నయన నాయర్‌, నరేష్‌ అయ్యర్‌ ఆలపించగా అరుణ్ చిలువేరు సంగీతం ఆకట్టుకుంది. చిత్రానికి అమరనాథ్‌ బొమ్మిరెడ్డి ఛాయాగ్రాకుడిగా, సత్య జి ఎడిటర్‌గా పనిచేశారు. సినిమాలో రాశీ సింగ్‌, జయప్రకాశ్‌, రాజీవ్‌కనకాల, అజయ్‌ కీలక పాత్రలు పోషించగా అశోక్, మహేష్ అచంట ఇతర పాత్రల్లో నటించారు. సినిమా ఓటీటీ వేదికైన అమెజాన్‌ ప్రైమ్‌లోనూ వచ్చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని