WTC Finals: 55:45 న్యూజిలాండ్‌కే అనుకూలం..!   - aakash chopra feels india could face challenges in wtc finals when fight against new zealand
close
Published : 25/05/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Finals: 55:45 న్యూజిలాండ్‌కే అనుకూలం..! 

టీమ్‌ఇండియా కన్నా కాస్త మెరుగ్గా ఉంది: ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా కన్నా న్యూజిలాండ్‌కే కాస్త విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఓపెనర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది కివీస్‌ పర్యటనలో టీమ్‌ఇండియా రెండు టెస్టులూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్‌ 18 నుంచి సౌథాంప్టన్‌లో జరిగే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ గురించి చోప్రా ఇలా చెప్పుకొచ్చాడు.

టీమ్‌ఇండియాను తక్కువగా చూడకపోయినా న్యూజిలాండే కాస్త ఆధిపత్యం చెలాయిస్తుందని, 55:45 సమీకరణంతో ఆ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయని చోప్రా పేర్కొన్నాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో రెండో స్థానంలో ఉన్న విలియమ్సన్‌ టీమ్‌ సౌథాంప్టన్‌ వేదికగా జరిగే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మెరుగ్గా ఆడుతుందని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఆ మ్యాచ్‌ జరిగే నాటికి న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడి ఉంటుందని, అలా చూసి దానికి అనుకూలమేనని వివరించాడునా. గతేడాది ఆస్ట్రేలియాలో విజయం సాధించిన టీమ్‌ఇండియా కివీస్‌ పర్యటనలో ఓటమిపాలైందని గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఇబ్బందులు తప్పవన్నాడు. అయితే, తాను ఒక భారతీయుడు అయినందున కోహ్లీసేనే విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మాజీ ఓపెనర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని