Team India: సూర్య, శ్రేయస్‌.. ఇద్దరిలో ఒకరంటే కష్టం - aakash chopra feels its difficult to choose between surya kumar and shreyas iyer for the t20 world cup
close
Published : 11/07/2021 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Team India: సూర్య, శ్రేయస్‌.. ఇద్దరిలో ఒకరంటే కష్టం

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయాలా లేదా శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోవాలా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియాలో సూర్యకుమార్‌ చోటు దక్కించుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాంతో అతడిని లంక పర్యటనకు ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా యూట్యూబ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చోప్రా ఇలా సమాధానమిచ్చాడు.

శ్రేయస్‌, సూర్యకుమార్‌ల ఎంపిక విషయంలో తాను కానీ, టీమ్‌ఇండియా సెలెక్టర్లు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పాడు. ‘ఇది చాలా కష్టతరమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. అలాగే సెలెక్టర్లు కూడా చెప్పలేరు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తే కోహ్లీ మూడో స్థానంలో ఆడతాడు. తర్వాత హార్దిక్‌, రిషభ్‌ పంత్‌.. ఐదు, ఆరు స్థానాల్లో ఉంటారు. ఆపై రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ వరుసగా ఉన్నారు. అలాంటప్పుడు అక్కడ మిగిలింది నాలుగో స్థానమే. దాంతో శ్రేయస్‌ను తీసుకోవాలా లేక సూర్యకుమార్‌ను ఎంపిక చేయాలా అనేది కఠిన నిర్ణయంగా మారుతుంది’ అని చోప్రా పేర్కొన్నాడు.

‘అయితే, శ్రేయస్‌ను ఎంపికచేయడానికి ప్రధాన కారణాలు.. అతడికి మంచి అనుభవం ఉండటం. వన్డే జట్టులో ఇదివరకే బాగా ఆడటం. మరోవైపు దిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి. మరోవైపు సెప్టెంబర్‌లో జరిగే ఐపీఎల్‌లో మరోసారి బాగా ఆడితే అతడిని ఎంపిక చేయొచ్చు. మరోవైపు సూర్యకుమార్‌ కూడా ఈ లంక పర్యటనలో దంచికొట్టి, ఆపై ఐపీఎల్‌లో మెరిస్తే అతడిని కూడా ప్రపంచకప్‌ ఈవెంట్‌కు ఎంపిక చేయొచ్చు. ఇది ఎటూ అర్థంకాని పరిస్థితి. ఇద్దరూ బాగా ఆడతారు. టీ20ల అనుభవం కూడా బాగుంది. అలాంటప్పుడు ప్రస్తుత ఫామ్‌ను చూసే వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది’ అని మాజీ క్రికెటర్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని