‘టీ కోసం కాదు.. రైతుల కోసం మా పోరాటం’ - aapadmi party mp tweet on pm modi tea prases of harivansh singh
close
Updated : 22/09/2020 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘టీ కోసం కాదు.. రైతుల కోసం మా పోరాటం’

ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ట్వీట్‌

దిల్లీ: సస్పెన్షన్‌ వేటుకు గురైన ఎంపీలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ తేనీరు అందించడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించడంపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ సంజయ్ సింగ్‌ స్పందించారు. తనతో సహా ఎనిమిది మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ‘‘ప్రధాని మోదీ.. తేనీరు కోసం పోరాటం చేయడంలేదు. మన రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్నాం. నాదొక విన్నపం..  రైతులకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చిన బిల్లులను వెంటనే ఉపసంహరించుకోండి. తగిన గౌరవంతో మీకు తేనీరు అందిస్తాం. దయ చేసి రైతుల ముద్దను వెనక్కి ఇవ్వండి’’ అని ట్వీట్‌ చేశారు. 

వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో రణరంగానికి కారణమైన నాలుగు పార్టీలకు చెందిన 8 మంది సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సోమవారం సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే. అయితే  సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన కొనసాగించారు. రాత్రి మొత్తం అక్కడ ఉండి నిరసన తెలిపారు. అయితే ఉదయం వారికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ తేనీరును అందించారు. కానీ ఎంపీలు దానిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో హరివంశ్‌ సింగ్‌ సహృదయతను ప్రధాని మోదీ ప్రశంసించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని