close
Published : 15/04/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్‌ లాల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌ లాల్‌ కథానాయకుడిగా, ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మలయాళ చిత్రం ‘ఆరాట్టు’. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. తాజాగా టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. పవర్‌ఫుల్‌ లుక్‌లో దర్శనమిచ్చి అలరిస్తున్నారు మోహన్‌ లాల్‌. ‘నేను వాడిని చంపేస్తాను’ అంటూ తెలుగులో ఆయన చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

యాక్షన్‌ నేపథ్యంగా సాగే ఈ సినిమాని హిప్పో ప్రైమ్‌ మోషన్‌ పిక్చర్స్‌, మూవీ పే మీడియాస్‌ ఆర్డీ ఇల్యుమినేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. మోహన్‌ లాల్‌ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని