దంచికొట్టి ఆదుకున్న డివిలియర్స్‌ - ab devilliers half century helps banglore to put good score for delhi
close
Updated : 29/04/2021 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దంచికొట్టి ఆదుకున్న డివిలియర్స్‌

దిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం 172

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. చివర్లో ఏబీ డివిలియర్స్‌(75 నాటౌట్‌; 42 బంతుల్లో 3x4, 4x6) దంచికొట్టి బెంగళూరును ఆదుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో రజత్‌ పాటిదార్‌(31; 22 బంతుల్లో 2x6), మాక్స్‌వెల్(25; 20 బంతుల్లో 1x4, 2x6) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు ఓపెనర్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(12), దేవ్‌దత్‌ పడిక్కల్‌(17) విఫలమయ్యారు.

ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించి వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. నాలుగో ఓవర్‌ చివరి బంతికి కోహ్లీని.. అవేశ్‌ఖాన్‌ బౌల్డ్‌ చేయగా మరుసటి ఓవర్‌ తొలి బంతికే దేవ్‌దత్‌ను.. ఇషాంత్‌ బౌల్డ్‌ చేశాడు. దాంతో బెంగళూరు 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై మాక్స్‌వెల్‌, రజత్‌ మూడో వికెట్‌కు మరో 30 పరుగులు జోడించారు. అయితే, ధాటిగా ఆడే క్రమంలో మాక్స్‌వెల్‌.. అక్షర్‌ బౌలింగ్‌లో స్టీవ్‌స్మిత్‌ చేతికి చిక్కాడు. అప్పటికి ఆర్సీబీ స్కోర్‌ 60/3గా నమోదైంది. ఆపై క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ చివరి వరకు క్రీజులో నిలిచి బెంగళూరుకు మంచి స్కోర్‌ అందించాడు. మధ్యలో రజత్‌, వాషింగ్టన్‌ సుందర్‌(6) ఔటయ్యారు. ఈ నేపథ్యంలోనే స్టోయినిస్‌ వేసిన చివరి ఓవర్‌లో డివిలియర్స్‌ మూడు సిక్సులు బాది 23 పరుగులు రాబట్టాడు. సామ్స్‌(3 నాటౌట్‌)గా నిలిచాడు. దాంతో దిల్లీ లక్ష్యం 172 పరుగులుగా నమోదైంది. దిల్లీ బౌలర్లలో ఇషాంత్‌, రబాడ, అవేశ్‌ ఖాన్‌, అమిత్ మిశ్రా, అక్షర్‌ పటేల్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని