కోహ్లీ-బాబర్‌: ఎవరు గొప్పో తెలియాలంటే..  - abdul razzaq says pakistan has more talent than indian players
close
Published : 11/03/2021 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ-బాబర్‌: ఎవరు గొప్పో తెలియాలంటే.. 

భారత్‌xపాక్‌ మ్యాచ్‌లు నిర్వహించాలి: రజాక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ మధ్య ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్‌ అనే విషయం తెలియాలంటే ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించాలని ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ అన్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కోహ్లీ, బాబర్‌ అజామ్‌ల బ్యాటింగ్‌ను క్రికెట్‌ పండితులు పోల్చి చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ఎవరు మేటి బ్యాట్స్‌మన్‌ అని అడిగిన ప్రశ్నకు రజాక్‌ ఇలా స్పందించాడు.

‘టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ ఆటగాళ్లను పోల్చిచూడొద్దు. ఎందుకంటే పాక్‌లోనే నైపుణ్యమున్న క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. చరిత్ర చూసినా, మాకు ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు కనిపిస్తారు. మహ్మద్‌ యూసుఫ్‌, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, సయీద్‌ అన్వర్‌, జావెద్‌ మియాందాద్‌, జహీర్‌ అబ్బాస్‌, ఇజాజ్‌ అహ్మద్‌ లాంటి వారు ఉన్నారు. వీళ్లని పోల్చిచూడండి. ఇక్కడ విరాట్‌, బాబర్‌ ఇద్దరూ వేర్వేరు ఆటగాళ్లు. వీరిని పోల్చిచూడాల్సి వస్తే భారత్‌xపాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించాలి. అప్పుడు ఎవరు గొప్ప ఆటగాడో నిర్ణయించవచ్చు’ అని పాక్‌ మాజీ చెప్పుకొచ్చాడు.

అలాగే విరాట్‌ కోహ్లీపైన తనకెలాంటి కోపతాపాలు లేవని, అతడు పాకిస్థాన్‌పైనా బాగా ఆడాడని రజాక్‌ గుర్తుచేశాడు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని, అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే, భారతీయులు తమ ఆటగాళ్లను పాక్‌ క్రికెటర్లతో పోల్చి చూడనప్పుడు తామెందుకు అలా చేయాలని రజాక్ పేర్కొన్నాడు. ఇక బాబర్‌ కూడా నైపుణ్యమున్న బ్యాట్స్‌మన్‌ అని, ప్రపంచ స్థాయిలో అతడేంటో నిరూపించుకున్నాడని చెప్పాడు. అతడిని సరిగ్గా చూసుకుంటే అన్ని రికార్డులూ బద్దలు కొడతాడని పాక్‌ మాజీ ధీమా వ్యక్తంచేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని