కోహ్లీ, రోహిత్‌, పుజారా గురించి అప్పుడే తెలిసింది  - abhimanyu easwaran says he got to know how virat rohit and pujara practice during net sessions
close
Published : 09/05/2021 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ, రోహిత్‌, పుజారా గురించి అప్పుడే తెలిసింది 

యువ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఏమన్నాడంటే

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికైన యువ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అవకాశం వస్తే ఇంగ్లాండ్‌లో తన ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. శుక్రవారం సాయంత్ర బీసీసీఐ ఆ రెండు ఈవెంట్లకు సంబంధించి 24 మంది ఆటగాళ్లతో ఓ జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో అభిమన్యుతో పాటు ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జాన్‌ నాగ్వాస్‌వాలా సైతం అదనపు ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.

కాగా, అభిమన్యు ఇంతకుముందు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు సైతం స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. కానీ, అప్పుడతడికి తుది జట్టులో అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఏదైనా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపాడు. అలాగే టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా ఎలా సాధన చేస్తారనే విషయాన్ని సైతం ఈ యువ క్రికెటర్‌ వివరించాడు. ‘ఆ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ ఎలా ప్రాక్టీస్‌ చేస్తారో వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎలా కష్టపడతారో దగ్గరుండి చూశా. ఆ ముగ్గురూ మ్యాచ్‌లో ఎలా ఆడతారో నెట్స్‌లోనూ అంతే తీవ్రంగా సాధన చేస్తారు. తర్వాతి రోజు ఆటలోనూ వారు అలాగే ఆడటం చూస్తే గొప్పగా అనిపిస్తుంది’ అని అభిమన్యు చెప్పుకొచ్చాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని