షారుఖ్‌ పాటలు వింటున్న అభిషేక్‌ బచ్చన్‌ - abhishake buchchan listening sharukh songs
close
Updated : 08/08/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షారుఖ్‌ పాటలు వింటున్న అభిషేక్‌ బచ్చన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం గత నెలలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌, ఆరాధ్య నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినా అభిషేక్‌ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఐసోలేషన్‌ వార్డులో ఒక్కరే ఉంటూ తనకు తోచిన విషయాలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే.. తన తోటి నటుడు షారుక్‌ ఖాన్‌ సినిమా పాటలు వింటున్నారు. అవునండీ.. తాజాగా అభిషేక్‌ ఆస్పత్రిలోని తన పేషెంట్‌ బోర్డు ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టగా.. తను ఏ పాట వింటున్నాడో తెలిసింది. 

అభిషేక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు అక్కడి వాతావరణాన్ని ఫొటో తీసి సోషల్‌మీడియాలో పెడుతున్నారు. ఇటీవల ఆయన రూం కిటికీ నుంచి బయట కనిపించిన అద్భుత ప్రకృతి సోయగాన్ని ఫొటో తీసి పెట్టారు. అందులో నీలిరంగు మబ్బులు.. పచ్చని చెట్లు ఎంతో ఆకట్టుకున్నాయి. తాజాగా ఆయన పేషెంట్‌ బోర్డును ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. అందులో అభిషేక్‌ వింటున్న ఓ పాట వినిపించింది. షారుఖ్‌ 2004లో నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలోని ‘యూన్‌ హి చలా చలా’పాటను అభిషేక్‌ వింటున్నారు. జీవితం ఎంతో అందమైంది.. చిన్న  చిన్న ఆనందాలను కూడా ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి అనే కోణంలో స్ఫూర్తివంతమైన సాహిత్యమున్న పాటది. ప్రస్తుత పరిస్థితిని అధిగమించడం కోసం అభిషేక్‌ ఆ పాట వింటున్నట్లుగా ఉంది. ఆయన తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఆస్పత్రిలో ఉన్నన్నిరోజులు తండ్రి హరివంశ్‌రాయ్‌ రాసిన కవితలను, ఇన్నాళ్లలో తను తెలుసుకున్న జీవిత సత్యాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని