‘లాహే లాహే..’ అంటూ ‘ఆచార్య’ కోలాహలం!  - acharya laahe laahe lyrical vedio
close
Updated : 31/03/2021 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లాహే లాహే..’ అంటూ ‘ఆచార్య’ కోలాహలం! 

హైదరాబాద్‌: ‘ఆచార్య’ నుంచి మొదటి సాంగ్‌ లిరికల్‌ వీడియో వచ్చేసింది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ‘లాహే లాహే..’అంటూ సాగుతున్న  పాటలో చిరుతో పాటు కాజల్‌, సంగీత మెరిశారు. ముఖ్యంగా మణిశర్మ తన మార్కు మెలోడి డ్యాన్సింగ్‌ బీట్స్‌తో మోతెక్కించారు. యథాప్రకారం చిరు తన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారని పాట వింటుంటే అర్థం అవుతోంది. విజువల్స్‌ చాలా గ్రాండ్‌గా అనిపిస్తున్నాయి.

రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటను హారిక నారాయణ్‌, సాహితి చాగంటి ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ‘ఆచార్య’టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవాదాయశాఖ నేపథ్యంగా సాగే ఈ చిత్రం మే 13 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మరి అప్పటిదాకా ‘లాహే లాహే’ లిరికల్‌ వీడియోను చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని