Acharya: విడుదల వాయిదా - acharya postponed
close
Published : 27/04/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Acharya: విడుదల వాయిదా

ప్రకటించిన చిత్ర బృందం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వేసవికి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమై, వాయిదా పడిన చిత్రాల జాబితాలో చేరింది ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మే నెలలో థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ చిత్రం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం.

‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మే 13న ఆచార్య చిత్రాన్ని విడుదల చేయట్లేదు. అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మాస్క్‌ ధరించండి, ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’ అని పేర్కొంది నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ. దేవాదాయ శాఖలో జరిగే అన్యాయాల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.  కాజల్‌, పూజా హెగ్డే నాయికలు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, లాహే లాహే పాట సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని